టాలీవుడ్లో నెవర్ బిఫోర్ రికార్డ్ తారక్ కంట్రోల్ లో.!

Published on Oct 24, 2020 8:05 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు అన్నంత పనీ ఇప్పుడు చేసారు. ముందు అనుకున్న టార్గెట్ ను అనుకున్న సమయంలో పూర్తి చెయ్యకపోయినా మొత్తానికి మాత్రం అతి తక్కువ సమయంలోనే కొట్టేసారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” నుంచి మోస్ట్ అవైటెడ్ కొమరం భీం టీజర్ ను మొన్న అక్టోబర్ 22న విడుదల చెయ్యడంతోనే సోషల్ మీడియా అంతా భీం టీజర్ కోసమే చర్చ.

విడుదల అయిన ప్రతీ నిమిషం నుంచీ యూట్యూబ్ లో భారీ రికార్డులు నమోదు చేస్తూ మొదలయిన ఈ టీజర్ తో ఎట్టకేలకు నందమూరి తారక రామారావు పేరిట ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ హీరోకు లేని నెవర్ బిఫోర్ రికార్డును అతని అభిమానులు అందించారు. ఈ టీజర్ కు 1 మిలియన్ లైకులు అందించి తెలుగులో మొట్ట మొదటి 1 మిలియన్ లైక్స్ కలిగిన టీజర్ గా మాత్రమే కాకుండా మొట్టమొదటి హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిలిచాడు.

మొత్తానికి మాత్రం తారక్ ఫ్యాన్స్ అన్నంత పని చేసేసారు.ఇప్పటికీ ఈ టీజర్ 18 మిలియన్ వ్యూస్ కు చేరువలో ఉండగా యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ అలాగే అలియా భట్ లు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :

More