“సర్కారు వారి పాట”లో అర్జున్ రోల్ ఇదేనా.?

Published on Jul 3, 2021 10:01 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి అందుకు తగ్గట్టుగానే స్ట్రాంగ్ సబ్జెక్ట్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా నటిస్తున్నారని టాక్ ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రంలో తన రోల్ మొదట విలన్ గా ఉంటుంది టాక్ వచ్చింది. ఇప్పుడు ఇదే రోల్ పై మరో టాక్ వినబడుతుంది. దాని ప్రకారం ఈ చిత్రంలో అర్జున్ పోలీస్ పాత్రలో కనిపిస్తారట. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే రెండో షెడ్యూల్ పునః ప్రారంభానికి సిద్ధం అవుతుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :