చరణ్ భారీ ప్రాజెక్ట్ పై మరో ఇంట్రెస్టింగ్ బజ్..!

Published on May 19, 2021 7:24 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళితో చేస్తున్న భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ తో ఇండియా లోనే మరో టాప్ దర్శకుడు శంకర్ తో ఇద్దరి కెరీర్ లోని బెంచ్ మార్క్ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం ఎప్పుడు మొదలు కానుంది అన్న దానిపై గత కొంత కాలం నుంచి సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే ఈ సినిమా పై తాజాగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ సినిమాలో శంకర్ తన మార్క్ స్ట్రాంగ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించనున్నారట. అంతే కాకుండా ఒక భారీ సెట్ కూడా వేస్తున్నారని తెలుస్తుంది. మరి ఇవి ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :