కాన్సెప్ట్ బేస్డ్ కథతో ‘ఆనంద్ దేవరకొండ’ !

Published on Apr 26, 2021 1:30 pm IST

యంగ్ హీరో ‘ఆనంద్ దేవరకొండ’ రీసెంట్ గా వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్ తో మొత్తానికి హిట్ కొట్టాడు. బలమైన నేపథ్యంలో భావేద్వేగమైన ప్రేమ కథలతో వచ్చిన ఆ చిత్రం.. డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద మంచి హిట్ అయింది. దాంతో ప్రస్తుతం ఆనంద్ మాత్రం వరుస సినిమాలు అంగీకరిస్తూ పోతున్నాడు. ఇప్పటికే పుష్కక విమానం సినిమాతో బిజీగా ఉన్న ఆనంద్, తాజాగా రఘు అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ ఆనంద్ కు బాగా నచ్చిందట.

కాగా కాన్సెప్ట్ బేస్డ్ కథ కావడంతో, ఈ సినిమా గురించి ఆనంద్ దేవరకొండ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాడు. ముఖ్యంగా కథలోని పాత్ర తనకు బాగా నచ్చిందట. కాగా జూన్ నుండి ఈ సినిమా షూట్ స్టార్ట్ తెలుస్తోంది. మొత్తానికి ఆనంద్ ఏదో భిన్నమైన కథనే చేయబోతున్నాడన్నమాట. మరి తన అన్నయ్యలా తానూ కూడా స్టార్ అవుతాడేమో చూడాలి. ఇక ప్రస్తుతం ఆనంద్ మరో సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :