‘రౌడీ జనార్దన’ క్లైమాక్స్ కోసం సన్నాహాలు !

‘రౌడీ జనార్దన’ క్లైమాక్స్ కోసం సన్నాహాలు !

Published on Nov 30, 2025 2:14 PM IST

vdkola 1

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్‌ కోలా తెరకెక్కించనున్న సినిమా ‘రౌడీ జనార్దన’. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ ను షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్లైమాక్స్ షూట్ పూర్తి అయ్యాక, విజయ్ దేవరకొండ పై సాంగ్ ను షూట్ చేస్తారట. అన్నట్టు ఈ క్లైమాక్స్ షూట్ ను ఈ నెల ఎండింగ్ లో తీసే అవకాశం ఉంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అన్నట్టు రాజశేఖర్ పాత్ర అండ్ ఆయన లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. ఇప్పటికే, లుక్‌ టెస్ట్‌ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్‌ నటించనుంది. కాగా ఇప్పుడు విజయ్‌ చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటిలో రాహుల్‌ సంకృత్యాన్‌ తెరకెక్కిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ఒకటి. ఈ సినిమాతో పాటు రౌడీ జనార్దన సినిమాను కూడా విజయ్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు