‘ఆర్ఆర్ఆర్’ లో మరో కొత్త హీరోయిన్ పేరు ?

Published on Apr 24, 2019 4:00 am IST

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా ప్రస్తుతం ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ కోసం వెతుకుంది చిత్రబృందం. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్స్ లో కొంతమంది పేర్లను కూడా పరిశీలిస్తోంది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం జాక్వెలిన్ ఫెర్నండజ్‌ పేరును కూడా హీరోయిన్ గా పరిగణలోకి తీసుకుందట చిత్రబృందం.

జాక్వెలిన్ ఫెర్నండజ్‌ ను సల్మాన్‌ ఖాన్, రాజమౌళికి రికమెండ్‌ చేశారని.. బాలీవుడ్‌ లో టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గాని ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సంబంధించి ఈ వార్త సోషల్ మీడియాలో బాగానే హల్ చల్ చేస్తోంది.

ఇక రామ్ చరణ్ కు గాయం అవ్వడం కారణంగా మూడు వారాల పాటు ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :