గెట్ రెడీ..”సర్కారు వారి పాట” టీజర్ పై హింట్స్.!

Published on Apr 22, 2021 10:00 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ తో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అండ్ మాస్ ఫ్లిక్ “సర్కారు వారి పాట”. భాయీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఇటీవల స్టార్ట్ చేసుకున్న రెండో షెడ్యూల్ కరోనా వల్ల తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న యువ నటి స్వప్నిక సోషల్ మీడియాలో నిర్వహించిన చాట్ సెషన్ లో సర్కారు వారి పాట పై కొన్ని ఆసక్తికర విషయాలనే వెల్లడించారు. మహేష్ కెరీర్ లో ఇంకో సాలిడ్ బ్లాక్ బస్టర్ లోడ్ అవుతుందని అలాగే దుబాయ్ లో ప్లాన్ చేసిన ఫైట్ ఎపిసోడ్ కూడా సూపర్బ్ గా వచ్చిందని తెలిపింది.

వీటితో పాటుగా మోస్ట్ అవైటెడ్ టీజర్ మరియు ఫస్ట్ లుక్ కోసం కూడా హింట్ ఇచ్చారు. మొదటి నుంచీ టీజర్ పరంగా వినిపిస్తున్న గాసిప్స్ కు అనుగుణంగానే వచ్చే మే 31న టీజర్ ఉండొచ్చేమో అని రెండు సార్లు హింట్ ఇచ్చారు. అయితే మరి ఇది సాధ్యమో కానీ పాటలు మాత్రం చాలా బాగా వచ్చాయట.

అలాగే ఫస్ట్ లుక్ మహేష్ పుట్టినరోజుకి కన్ఫర్మ్ అని ఈ సెషన్ లో ఆమె తెలిపింది. సో అప్పటి వరకు మహేష్ ఫ్యాన్స్ వెయిట్ చెయ్యక తప్పదు. ప్రతీ చిన్న అంశంలోనూ ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి పరశురామ్ ఎలాటి ఫీస్ట్ ఇస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :