“బిగ్ బాస్ ఓటిటి” కి హోస్ట్ గా మరొకరి పేరు వైరల్.!

“బిగ్ బాస్ ఓటిటి” కి హోస్ట్ గా మరొకరి పేరు వైరల్.!

Published on Feb 22, 2022 3:00 PM IST


మన తెలుగు బుల్లితెర వద్ద అతిపెద్ద హిట్ అయినటువంటి రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది “బిగ్ బాస్” అనే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో ఆదరణ కలిగి ఉన్న ఈ గ్రాండ్ రియాలిటీ షో మన దేశంలో కూడా అనేక భాషల్లో సూపర్ హిట్ అయ్యింది.

ఇక ముఖ్యంగా మన తెలుగులో అయితే ప్రతి సీజన్లోనూ ఆల్ టైం రికార్డు రెస్పాన్స్ తో వెళ్తున్న ఈ షో సక్సెస్ చూసి మేకర్స్ ఇప్పుడు ఓటిటి లో కూడా సిద్ధం చేశారు. మరి ఆల్రెడీ డేట్ కూడా తెచ్చుకున్న ఈ షో కి గాను హోస్ట్ గా ఎవరు చేస్తారు అనే ప్రశ్న ఇంకా ఇంట్రెస్టింగ్ గానూ సస్పెన్స్ గానే ఉందని చెప్పాలి.

అయితే గత సీజన్ కి చెందిన కొందరి కంటెస్టెంట్స్ పేర్లు ఈ సీజన్ కి హోస్ట్ గా వినిపించాయి. కానీ ఇపుడు మరో పేరు వైరల్ అవుతుంది. అతడు మరెవరో కాదు, లాస్ట్ సీజన్లో డెఫినెట్ గా ఫైనల్స్ లో ఒకడిగా నిలుస్తాడు అనుకున్న కంటెస్టెంట్ యాంకర్ రవి అట. ఇప్పుడు రవి పేరే ఫైనల్ అయ్యినట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ ఏమన్నా వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు