‘భోళా శంకర్’ కోసం చిరు కొత్త లుక్ !

‘భోళా శంకర్’ కోసం చిరు కొత్త లుక్ !

Published on Sep 13, 2021 7:00 AM IST

టాలెంటెడ్ డైరెక్టర్ మెహ‌ర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవితో ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, మెగాస్టార్ తన కెరీర్ లో ‘భోళా శంకర్’ పాత్ర కోసం పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు. ఆ మధ్య చిరు గుండు లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ లుక్ ఈ సినిమాలోదే. అలాగే ఈ సినిమాలో మరో క్రేజీ లుక్ కూడా ఉందట. ఆ లుక్ పూర్తి డిఫరెంట్ గా ఉంటుందట.

కాగా మెహ‌ర్ ర‌మేష్ ఈ సినిమా స్క్రిప్ట్ ను బాగా డిజైన్ చేశారట. ముఖ్యంగా కథలోని మెయిన్ ఎమోషన్స్ అద్భుతంగా వచ్చాయట. ఇక ఈ సినిమా చిరుకి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక హీరోలను స్టైలిష్ గా చూపించడంలో మెహర్ రమేష్ టాలెంట్ అతి తక్కువ మంది డైరెక్టర్లకి మాత్రమే ఉంది. మరీ మెగాస్టార్ ను మెహర్ రమేశ్ ఎంత కొత్తగా చూపిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు