ఆది ‘బుర్రకథ’ కు కొత్త రిలీజ్ డేట్…!

Published on Jun 29, 2019 12:18 pm IST

ఆది సాయికుమార్,మిస్త్రీ చక్రవర్తి, నైరషా ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “బుర్రకథ”.రచయిత నుండి దర్శకుడిగా మారిన డైమండ్ రత్నబాబు ,రెండు విభిన్న మనస్థత్వాలున్న యువకుడి కథ గా “బుర్రకథ” చిత్రాన్ని తెరకెక్కించారు. ఐతే ఈమూవీ నిన్న విడుదల కావాల్సివుండగా అనూహ్యంగా వాయిదా పడింది. చిత్రం సెన్సార్ కార్యక్రమాలలో జరిగిన జాప్యం వలన మూవీ విడుదల వాయిదాపడిందని త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తాం అని చిత్ర యూనిట్ సమాధానం చెప్పుకున్నారు.

కాగా ఈ మూవీని జులై 5న విడుదల చేయాలని నిర్ణయించారట నిర్మాతలు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్స్ కూడా విడుదల చేశారు. ఐతే అదే రోజు సమంత నటించిన “ఓ బేబీ” మూవీతో పాటు, ఆనంద్ దేవరకొండ,శివాత్మికల “దొరసాని” విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాలను కూడా సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేయనుండటంతో “బుర్రకథ” మూవీకి థియేటర్ల సమస్య వచ్చే ఆస్కారం కలదు. దీపాల ఆర్ట్స్ బ్యానర్ మీద హెచ్‌కె శ్రీకాంత్ దీపాల, కిషోర్, ఎంవీ కిరణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More