కొంచెం ముందుకు జరిగిన నిఖిల్ సినిమా !
Published on Feb 21, 2018 5:37 pm IST

యంగ్ హీరో నిఖిల్ చేస్తునం తాజా చిత్రం ‘కిరాక్ పార్టీ’. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా ఇదివరకే విడుదలవ్వాల్సి ఉండగా పనులు బ్యాలెన్స్ ఉండటం వలన మార్చి 22కు వాయిదాపడింది. కానీ ఇప్పుడు పనులు అనుకున్న గడువు కంటే ముందే పూర్తవుతుండటంతో కొంచెం ముందుగానే సినిమాను విడుదలచేయాలని నిర్ణయించిన నిర్మాతలు మార్చి 16ను కొత్త విడుదల తేదీగా ఫిక్స్ చేశారు.

ఈ చిత్రంలో నిఖిల్ కు జోడీగా సిమ్రన్ పరీన్జ, సంయుక్త హెగ్డేలు నటించారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్లో నడిచే ఈ సినిమాకు డైరెక్టర్ సుధీర్ వర్మ స్ర్రీన్ ప్లే అందించగా మరోక దర్శకుడు చందూ మొండేటి మాటలు రాశారు. కన్నడ హిట్ చిత్రం ‘కిరిక్ పార్టీ’కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాకు అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించగా శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించాడు.

 
Like us on Facebook