ది ప్యారడైజ్ కోసం కొత్త రిలీజ్ ఆలోచన..?

ది ప్యారడైజ్ కోసం కొత్త రిలీజ్ ఆలోచన..?

Published on Jun 23, 2026 9:58 AM IST

బ్లాక్‌బస్టర్ ‘దసరా’ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ “ది ప్యారడైజ్” . మొదట మార్చి, ఆ తర్వాత ఆగస్టు అనుకున్నప్పటికీ.. తాజా ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25, 2026న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

​ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే పెరిగినప్పటికీ, చిత్ర కంటెంట్ మరియు క్వాలిటీపై నిర్మాతలు పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై పాన్-ఇండియా లెవెల్లో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది.

​ఈ చిత్రంలో మోహన్ బాబు, కాయాదు లోహర్, రాఘవ్ జుయల్, బాబు మోహన్, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ళ భరణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు