‘అమీర్ – కిరణ్’ విడాకుల పై కొత్త రూమర్ !

Published on Jul 3, 2021 5:02 pm IST

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావుతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 15 ఏళ్ల తమ వివాహ బంధానికి ఇలా సడెన్ గా ఫుల్ స్టాప్ పెట్టడానికి కారణం ఇదే అంటూ బాలీవుడ్ మీడియా ఓ రూమర్స్ ను తెగ వైరల్ చేస్తోంది. అమీర్ – కిరణ్ రావు మధ్య అమీర్ ఖాన్ మొదటి భార్య సంతానం విషయంలోనే అభిప్రాయభేదాలు వచ్చాయని తెలుస్తోంది.

ఆ అభిప్రాయభేదాలు రోజురోజుకూ ఎక్కువ అవ్వడంతో తాము విడిపోవడమే మంచింది అని నిర్ణయించుకుని.. ఇద్దరూ కలిసి ఈ ప్రకటనను విడుదల చేశారట. ఈ సందర్భంగా వీరిద్దరూ ఓ మెసేజ్ పోస్ట్ చేస్తూ.. ‘భార్యాభర్తలుగా మేము విడిపోయినప్పటికీ, ఎప్పటికీ స్నేహితులుగా, అలాగే కుటుంబ సభ్యులుగా మా బంధాన్ని కొనసాగిస్తాము. ఆజాద్ తల్లిదండ్రులుగా మా జీవితాలు పెనవేసుకొని ఉంటాయి.’ అంటూ పెట్టిన మెసేజ్ కూడా తాము కేవలం పిల్లల విషయంలోనే కట్టుబడి ఉన్నాం అని చెప్పినట్లు అయింది.

సంబంధిత సమాచారం :