సాహో అంతకు మించి వుంటుందట !

సాహో అంతకు మించి వుంటుందట !

Published on Sep 30, 2018 12:57 PM IST

telugu

‘బాహుబలి’ చిత్రంతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నస్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో తమిళ నటుడు అరుణ్ విజయ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం గురించి అరుణ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సాహోలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నానని అలాగే ఈ చిత్రం బాహుబలి ని మించి ఉంటుందని ఆయన అన్నారు .

మణిరత్నం తెరకెక్కించిన ‘నవాబ్’ చిత్రంలో అరుణ్ ముఖ్య పాత్రలో నటించాడు. ఈచిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ సందర్బంగా జరిగిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వాఖ్యలు చేశాడు. ఇక అరుణ్ విజయ్ , రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్‌లీ’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.

తాజా వార్తలు