విక్టరీ వెంకటేశ్ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఆదర్శకుటుంబం చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, ఈ సినిమా ఇంటర్వెల్ పై ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో వెంకీ ‘రా ఏజెంట్’గా కనిపించబోతున్నారు. ఈ విషయం ఇంటర్వెల్ లోనే రివీల్ అవుతుందని.. రా ఏజెంట్ కోణంలోనే సెకండాఫ్ ప్లే కూడా సాగుతుందని.. ‘రా ఏజెంట్’గా వెంకీ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఫుల్ కామెడీ సీక్వెన్సెస్ కూడా ఉంటాయని టాక్.
ఇక నాణ్యత విషయంలో త్రివిక్రమ్ ఎక్కడా రాజీ పడటం లేదు. అనుకున్న సమయానికే సినిమాను పూర్తి చేసి వేసవి వినోదాన్ని అందించాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. అన్నట్టు త్రివిక్రమ్, వెంకటేశ్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ తదితర చిత్రాలకు రచయితగా పని చేశారు. ఈ కాంబినేషన్‌లో మూవీని ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతుంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సాధిస్తుందో చూడాలి.


