అనుష్క ‘ఘాటీ’ లో మరో కీలక పాత్ర ?

అనుష్క ‘ఘాటీ’ లో మరో కీలక పాత్ర ?

Published on Apr 29, 2024 8:07 PM IST

డైరెక్టర్ క్రిష్, అనుష్క ప్రధాన పాత్రలో ఘాటీ అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఐతే, ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్యం రాజేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అనుష్క పాత్రతో పాటు సత్యం రాజేష్ పాత్ర కూడా సినిమాలో చాలా కీలకంగా ఉండబోతుంది అని తెలుస్తోంది. ఇక ఆ మధ్య ఈ సినిమా గురించి ప్రకటిస్తూ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో అనుష్క చీర కట్టుకొని తలపై ముసుగు వేసికొని నడుస్తూ వెళ్లపోతున్నట్టు చూపించారు

కాగా ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. ఆ సినిమాతో పాటు ఘాటీ సినిమాలో మాత్రమే అనుష్క నటిస్తోంది. ఇక ఈ చిత్రం థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత ఘాటీ అమెజాన్ లోకి రానుంది. అన్నట్టు క్రిష్ – పవన్ సినిమా విషయానికి వస్తే.. మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ‘హరిహర వీరమల్లు’ సినిమా తెరకెక్కుతోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు