చోరీకి పాల్పడ్డారని వారిని బంధించిన హీరో !

చోరీకి పాల్పడ్డారని వారిని బంధించిన హీరో !

Published on Jun 24, 2026 3:01 PM IST

తమిళ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ స్టార్ డమ్ తెచ్చుకున్న నటుల్లో జయం రవి కూడా ఒకరు. ఈ మధ్య తన భార్య విషయంలో వివాదం అయిన ఈ హీరో ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచారు. చోరీకి పాల్పడ్డారని తన ఇంట్లో పనిచేసే ఇద్దరు మహిళలు, ఓ బాలుడిని జయం రవి బంధించినట్లు వార్తలు వచ్చాయి. చెన్నై నీలాంగరైలో జయం రవి నివాసం ఉంది. ఇంట్లో నగలు, నగదు చోరీ అయ్యాయని అక్కడ పనిచేస్తున్న ఇద్దరు మహిళలు, ఓ బాలుడిని జయంరవి బంధించినట్లు టాక్ నడుస్తోంది. జయం రవి ఇంట్లో పని చేసే పని మనిషి ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త అక్కడకు వెళ్లాడు.

కాగా అక్కడ తన భార్యను బంధించినట్లు అతను తెలుసుకున్నాడు. భార్యను ఇంటికి పంపాలని కోరగా.. జయం రవి నిరాకరించారు. దీంతో, భర్త నీలాంగరై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నటుడి ఇంటికి వెళ్లి మహిళలను బంధించడం సరికాదని హితవు పలికి వారిని విడిపించారని తెలుస్తోంది. అదేవిధంగా చోరీ విషయమై ఫిర్యాదు చేయాలని జయం రవికి సూచించారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ వ్యవహారంలో జయం రవికి సంబంధం లేదని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు