పాతికేళ్ల కుర్రాడిగా సీనియర్ హీరో ?

Published on Jun 4, 2023 7:22 pm IST

విజువల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. కాగా ఎన్నో అడ్డంకులను అధిగమించి మళ్ళీ మొదలైన ఈ సినిమా పై ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఓ ఎపిసోడ్ లో కమల్ హాసన్ 25 ఏళ్ల యువకుడిగా కనిపించబోతున్నాడు. విఎఫ్ఎక్స్ సహాయంతో కమల్ ను దర్శకుడు శంకర్ యంగ్ లుక్ లో చూపించబోతున్నాడు.

ఇక ఈ సినిమా కథలో మెయిన్ మ్యాటర్ విషయానికి వస్తే.. నార్త్ నుంచి వచ్చి దేశాన్ని ఏలుతున్న నాయకులు సౌత్ ఇండియా పై, ఇక్కడ రాష్ట్ర ప్రజల పై చిన్నచూపు చూస్తారని ఈ సినిమాలో చూపించబోతున్నారట. మొత్తానికి సౌత్ రాజకీయ నాయకుల పై నార్త్ నాయకులు స్వార్ధపూరితమైన నిర్ణయాలను ఎలా తీసుకుంటున్నారని కూడా చూపించబోతున్నారట.

కాగా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ‘భారతీయుడు 2’లో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక భారతీయుడు 2 చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు నాటికి షూటింగ్ అంతా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :