టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ‘కృష్ణ వంశీ’ ప్రస్తుతం ‘రంగమార్తాండ’ అనే సినిమా చేస్తున్నాడు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఫిల్మ్ నగర్ లోని ఓ గెస్ట్ హౌస్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. రమ్యకృష్ణ పై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఇక దాదాపు 80 శాతం టాకీ పార్ట్ ను ఈ సినిమా పూర్తి చేసుకుంది. మరో షెడ్యూల్ ఒక్కటే ఇక బ్యాలెన్స్ ఉంది. అలాగే రెండు రోజుల తర్వాత ప్రకాష్ రాజ్ – రమ్యకృష్ణ పై కొన్ని కీలక సన్నివేశాలు తీయబోతునట్లు తెలుస్తోంది.
కాగా ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ చేస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణిని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాలో అనసూయకు ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. అనసూయ పాత్ర కథలో కీలకంగా ఉంటుందట. నాటకాలు వేసే కళాకారిణిగా ఆమె నటిస్తోందట. పైగా జీవితాంతం అవివాహితగానే ఉండే స్త్రీ పాత్రలో అనసూయ నటిస్తోందట. ఇక ఈ సినిమాని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా మళ్ళీ కృష్ణవంశీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.


