నాగ్ ‘బంగార్రాజు’ పై లేటెస్ట్ అప్ డేట్ !

నాగ్ ‘బంగార్రాజు’ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Nov 23, 2020 8:30 AM IST

అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’లో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. దీంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జునతో ఆ సినిమాకి సీక్వెల్ తీయబోతున్న సంగతి కూడా తెలిసిందే. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమాను మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. కాగా సింగిల్ షెడ్యూల్ లోనే ఈ సినిమా మేజర్ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుంది.

మొత్తానికి ‘బంగార్రాజు’ రాక ఆలస్యం అయినా, ఆసక్తి ఉండేలా ఉంది. ఎలాగూ ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది కాబట్టి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. ఇక అక్కినేని నాగార్జున ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగ్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్, ఎన్ఐఏ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇది నాగర్జున గతంలో చేసిన యాక్షన్ చిత్రాలకంటే భిన్నంగా ఉంటుందట. ఇందులో బాలీవుడ్ బ్యూటీలు సయామీ ఖేర్, దియా మీర్జాలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టెయిన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు