నిఖిల్ ’18 పేజెస్’ లేటెస్ట్ అప్ డేట్ !

Published on Apr 19, 2021 10:04 pm IST

టాలెంటెడ్ హీరో నిఖిల్ కమర్షియల్ ఫార్ములాకు దూరంగా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ కథల్నే ఎంచుకుంటూ ఉంటాడు. కాగా ప్రస్తుతం నిఖిల్ ’18 పేజెస్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కీలక భాగం ఇప్పటికే పూర్తి చేసుకుంది. ప్రస్తుత షెడ్యూల్ హైదరాబాద్ లో ఓ గెస్ట్ హౌస్ లో షూటింగ్ జరుగుతుంది. కాగా ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లో హీరోహీరోయిన్ల పై కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ తీసుకున్న సంగతి తెలిసిందే.

అన్నట్టు ఈ చిత్రం కూడా వైవిధ్యంగా ఉంటుందని.. హీరో పాత్ర మెమరీ లాస్ సమస్యతో సఫర్ అవుతూ ఉంటుందని ఇప్పటికే రూమర్స్ వినిపించాయి. అయితే ఈ మెమరీ లాస్ కంటే కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నిఖిల్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడని.. ఈ సినిమా థీమ్ కూడా డిఫరెంట్ పాయింట్ తో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేయనుండగా గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :