హరీష్ ఫుల్ స్క్రిప్ట్ కి పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ !

Published on May 3, 2021 2:07 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకి సంబంధించి హరీష్ శంకర్ పూర్తి స్క్రిప్ట్ ను పూర్తి చేశాడని, పవన్ కూడా పూర్తి స్క్రిప్ట్ ను చదివాడు అని, షూట్ కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని తెలుస్తోంది. జులై నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా కోసం నెలకు పది రోజుల చొప్పున పవన్ డేట్స్ ఇవ్వనున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ ప్లాష్ బ్యాక్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా ప్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్రలోనూ.. అలాగే లైవ్ లో వచ్చే కొడుకు పాత్రలోనూ పవన్ రెండు పాత్రల్లో కనిపిస్తాడట. కాగా తండ్రి పాత్రది పోలీస్ ఆఫీసర్ పాత్ర అట. ఇక గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అప్పటికే వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. మరి ఈ సారి కూడా ఈ క్రేజీ కాంబినేషన్ నుండి వచ్చే సినిమా రికార్డ్స్ ను సృష్టిస్తోందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :