పవన్ ‘విరూపాక్ష’ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Apr 2, 2020 3:00 am IST

కరోనా పై పోరాటంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులతో పాటు ప్రభుత్వాలను కూడా బాగానే అప్రమత్తం చేస్తున్నారు. ఇక పవర్ స్టార్ ఇటు రాజకీయాలతో పాటు అటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో చేయబోతున్న చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్ర లేటెస్ట్ అప్ డేట్ ఒకటి తెలిసింది. పవన్ పిరియాడిక్ క్యారెక్టర్ లో నటిస్తున్నారని మంచి కోసం పోరాడే ఓ హిస్టారికల్ పాత్ర అని తెలుస్తోంది. మొత్తానికి చారిత్రక కాలం నాటి ఓ ఎమోషనల్ విప్లవాత్మకమైన చిత్రం అట.

కాగా ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారు. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పింక్’ రీమేక్ విడుదల అయిన నెలకే పెద్దగా గ్యాప్ లేకుండానే ఈ చిత్రం కూడా విడుదలకానుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ రీఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More