‘నాగ్ అశ్విన్’ సినిమాలో ప్రభాస్ హీరోయిన్ ?

‘నాగ్ అశ్విన్’ సినిమాలో ప్రభాస్ హీరోయిన్ ?

Published on Apr 25, 2020 3:00 AM IST

అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబోతున్న ‘ప్రభాస్ – నాగ్ అశ్విన్’ సినిమాలో కీలక పాత్రల కోసం బాలీవుడ్ స్టార్స్ ను తీసుకొవాలని చూస్తున్నాడు నాగ్ అశ్విన్. ఇక ప్రభాస్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫోన్ లోనే ఆమెను సంప్రదించారని, లాక్ డౌన్ తరువాత ఫైనల్ చేయనున్నారని కూడా ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.

మొత్తానికి పాన్ -ఇండియా చిత్రంగా ఈ సినిమాని మలచడానికి నాగ్ అశ్విన్ బాగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. కాగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరోగా నటిస్తున్నాడట. కాబట్టి, సహజంగానే, ఈ చిత్రంలో విఎఫ్‌ఎక్స్‌ భారీగా ఉంటాయి. దాంతో అశ్వినీదత్ ఈ చిత్రం విఎఫ్‌ఎక్స్ కోసం 50 కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించారట.

ఈ చిత్రం కోసం విఎఫ్ఎక్స్ చేయటానికి టాప్ సాంకేతిక నిపుణులలో కూడా చర్చించారట. ఇక నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు