‘దృశ్యం 2’ రిలీజ్ కూడా అలాగే చేస్తారా ?

Published on Apr 19, 2021 11:00 am IST

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘ఎఫ్ 3’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే, వెంకీ హీరోగా ‘దృశ్యం 2’ సినిమా జరుగుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తీసిన జీతూ జోసెఫ్ నే తెలుగు రీమేక్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నాడని తెలిగాయనే ఈ సినిమా పై భారీ అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి వెంకటేశ్ తన షూట్‌ను పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి ఒక వార్త బాగా హల్ చల్ చేస్తోంది.

మలయాళ వెర్షన్ ‘దృశ్యం 2’ను ఓటీటీలోనే విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ మరింత వ్యాపిస్తుండటంతో తెలుగు వెర్షన్ ను కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే బాగుంటుంది అన్నట్టు మేకర్స్ ఆలోచన చేస్తున్నారట. తెలుగు ‘దృశ్యం2’ను ఓటీటీలో విడుదల చేస్తారా? లేదా అనేది చూడాలి. అన్నట్టు ‘దృశ్యం 2’ తెలుగు వర్షన్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశారని.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు.. అలాగే వెంకటేష్ ఇమేజ్ కి తగ్గట్లు మార్పులు చేశారట.

కాగా నదియా, నరేశ్‌, కృతికా జయకుమార్‌, ఎస్తర్‌, పూర్ణ, సంపత్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేశ్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :