రాజమౌళి ప్రెస్ మీట్ కు సంబంధించిన డిటైల్స్ !

రాజమౌళి ప్రెస్ మీట్ కు సంబంధించిన డిటైల్స్ !

Published on Mar 12, 2019 6:13 PM IST

రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన వివరాలను వెల్లడించడానికి ప్రెస్ మీట్ ను నిర్వహించాలనుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రెస్ మీట్ కు సంబధించి చిత్రబృందం ఒక అప్ డేట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

హైదరాబాద్ లోని పార్క్ హైయేత్ హోటల్ లో మార్చి 14వ తేదీన ఈ ప్రెస్ మీట్ జరగనుందని పేర్కొంది. కాగా ఈ ప్రెస్ మీట్ కు చిత్రబృందంలోని కీలక సభ్యులతో పాటు ఎన్టీఆర్ – రామ్ చరణ్ కూడా హాజరవుతున్నారు. మరి ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి ఏం చెప్తారో ఏ విషయాలను రివీల్ చేస్తారో చూడాలి.

ఇక జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో ఈ సినిమా రావడంతో.. అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పూర్తి కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నారు. రామ్ చరణ్ కూడా కొత్త హెయిర్ స్టైల్ తో కనిపిస్తారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు