వెబ్ ఫిల్మ్స్ లో ట్రెండ్ అవుతోన్న కొత్త సినిమా !

Published on Aug 7, 2020 11:00 am IST

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 లో ఇటీవలే రిలీజ్ అయిన ఈ వెబ్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాలో నేటివిటీకి సంబంధించిన స్టోరీ వరల్డ్ మరియు స్వచ్ఛమైన ప్రేమ కోసం హీరో పడే సంఘర్షణ.. అలాగే ఆహ్లాదమైన ప్రేమ సన్నివేశాలు మరియు పల్లెటూరి అమాయకంతో ఆవేశం కలిగిన పాత్రల మధ్య నడిచిన ఎమోషనల్ సన్నివేశాలు సినిమాలో చక్కగా కుదరడం… అదేవిదంగా యాసలో సాగే డైలాగులు, దర్శకుడు త్రినాధ్ నటీనటుల నుండి రాబట్టుకున్న సహజసిద్ధమైన నటన వంటి అంశాలు.. ఈ సినిమాకి మెయిన్ హైలైట్స్ గా నిలిచాయి.

హీరో హీరోయిన్ ఇద్దరూ తమ ప్రేమను ఒకరికొకరు ఎక్స్‌ ప్రెస్‌ చేసుకునే సన్నివేశం కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తోంది. ఇక ప్రధాన పాత్రలు చేసిన హీరో అభినయ్, హీరోయిన్ సుమయ ఇద్దరు కొత్తవారైనప్పటికీ, తమ నటనతో ఆయా పాత్రలలో చక్కగా నటించారు. ప్రేమ కోసం ఏమైనా చేసే యువకుడిగా అభినయ్ నటన చాలా సహజంగా ఉంది. అలాగే అప్పలనాయుడు పాత్ర, ఆ పాత్ర టైమింగ్ అండ్ మ్యానరిజమ్స్ బాగున్నాయి.

దర్శకుడు త్రినాధ్ మంచి నేపథ్యంలో ఆసక్తికరమైన పాత్రలతో ఈ సినిమాను అందంగా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా అతను రాసుకున్న కథనం చాలా బాగా ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు ప్రజ్వల్‌ క్రిష్‌ అందించిన సంగీతం బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి తగట్లు ఆకట్టుకుంటుంది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా పార్థు సైనా సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఫేమస్ డిస్ట్రిబ్యూట్ కార్తీక్ కంచెర్లకు చెందిన సింబా ఎంటర్‌టైన్మెంట్ ఈ సినిమాని నిర్మించింది. మొత్తానికి తెలుగులో వచ్చిన వెబ్ ఫిల్మ్స్ లో మేక సూరి ప్రత్యేకంగా నిలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More