ప్రభాస్ స్టార్ట్ చేసేది ఈ సినిమాతోనే ఏమో.!

Published on May 16, 2021 7:24 pm IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పలు బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన భారీ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం సహా రాధే శ్యామ్ మరియు ఆదిపురుష్ చిత్రాల తాలూకా షూట్స్ కూడా హైదరాబాద్ కే షిఫ్ట్ అయ్యాయి.

ఇక అసలు ప్రకారం అయితే ప్రభాస్ ముంబైలో ఆదిపురుష్ షూట్ కంప్లీట్ చేసాక రాధే శ్యామ్ షూట్ ఇక్కడ చెయ్యాల్సి ఉంది కానీ కోవిడ్ మూలాన అది కాస్తా దూరం జరిగింది. అలాగే ఆదిపురుష్ కూడా రేస్ లోకి వచ్చింది. కానీ ఇప్పుడు ప్రభాస్ నయా మేకోవర్ చూస్తూ ఉంటే తాను నెక్స్ట్ సలార్ షూట్ లో పాల్గొననున్నట్టు అనిపిస్తుంది.

మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన పోస్టర్ లో ఉన్నట్టుగా రగ్గుడ్ లుక్ లోకి ప్రభాస్ ఇప్పుడు వచ్చేసాడు. మరి ప్రభాస్ నెక్స్ట్ షూట్ సలార్ తోనే స్టార్ట్ చేస్తాడా లేదా అన్నది చూడాలి. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా కేజీయఫ్ నిర్మాణ సంస్థ హోంబలే వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :