ఆర్ఆర్ఆర్ భారీ యాక్షన్ సీక్వెన్క్ కి ప్లాన్ చేస్తున్న జక్కన్న

Published on Jan 17, 2020 9:00 pm IST

కొద్దిరోజులు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి విరామం ఇచ్చారు. ఇటీవల వైజాగ్ లోని ఏజెన్సీ ఏరియాలో ఎన్టీఆర్ పై కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిపిన చిత్ర యూనిట్ ఆ షెడ్యూల్ అనంతరం కొంత విరామం ప్రకటించింది. తదుపరి షెడ్యూల్ ఏర్పాట్లకు సమయం ఉండటంతో వీరికి కొంత బ్రేక్ దొరికింది. ఐతే రాజమౌళి నెక్స్ట్ షెడ్యూల్ వికారాబాద్ ఫారెస్ట్ లో ప్లాన్ చేశారట. రాజమౌళి ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కి ప్రణాళిక వేశారట. ఈ షెడ్యూల్ నందు ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు పాల్గొననున్నారని సమాచారం. ఈనెల 20 నుండి ఈ షెడ్యూల్ మొదలుకానుందని సమాచారం.

ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మాతగా దాదాపు 300కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దాదాపు దేశంలోని పది ప్రధాన భాషలలో పాన్ ఇండియా మూవీగా ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి సంగీతం కీరవాణి అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More