‘ప్యారడైజ్’ నుంచి అనిరుధ్ నెక్స్ట్ వదిలేది అలాంటి పాటనా..?

‘ప్యారడైజ్’ నుంచి అనిరుధ్ నెక్స్ట్ వదిలేది అలాంటి పాటనా..?

Published on Apr 21, 2026 11:48 PM IST

The-Paradise

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా నుండి విడుదలైన మొదటి పాట ‘ఆయా షేర్’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. అనిరుధ్ రవిచందర్ మార్క్ మాస్ బీట్స్‌తో ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ భారీ విజయం తర్వాత, ఇప్పుడు మేకర్స్ అందమైన మెలోడీ సాంగ్‌పై దృష్టి సారించారు.

తాజా సమాచారం ప్రకారం, ఈ వారంలోనే నాని మరియు హీరోయిన్ కయాదు లోహర్ మధ్య ఒక రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ‘ఆయా షేర్’ పాటతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడంతో, ఇప్పుడు రాబోయే రొమాంటిక్ నంబర్‌పై కూడా భారీ హైప్ నెలకొంది. అనిరుధ్ గతంలో ‘దేవర’ కోసం అందించిన ‘చుట్టమల్లే’ వంటి మేజిక్‌ను ఇక్కడ కూడా రిపీట్ చేస్తే, సినిమా మ్యూజికల్ హిట్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్‌గా నటిస్తుండగా, రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్ బాబు, బాబు మోహన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ మూవీ నుంచి నెక్స్ట్ రాబోయే సాంగ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

తాజా వార్తలు