వచ్చే వారం అవతార్-2 షూటింగ్ రీస్టార్ట్.. ఎక్కడంటే?

Published on May 22, 2020 11:39 pm IST

హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా సినీ పరిశ్రమలో చెరిగిపోని ముద్రను వేసుకున్న సినిమా ఏదంటే అది అవతార్ అనే చెప్పాలి. ఈ సినిమాకు జేంస్ కామెరూన్ దర్శకత్వం వహించగా, 21 సెంచరీ ఫాక్స్ ఐఎన్‌సీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు నిర్మించారు. అయితే జేంస్ ఈ సినిమాలో టెక్నాలజీని కన్నులకు కట్టినట్లుగా చూపించి ఈ సినిమా ద్వారా సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేశాడు. అయితే అవతార్ సినిమా ప్రేక్షకుల మనసుని మాత్రం బాగా ఆకట్టుకోవడంతో దర్శక నిర్మాతలు దీనికి సీకెవెల్స్ కూడా ప్లాన్ చేశారు.

అయితే అవతార్‌కి సీక్వెల్‌గా అవతార్ 2,3,4,5 లు ఉంటాయని ఇదివరకే తెలిపిన చిత్ర యూనిట్ అవతార్ 2 కి సంబంధించి ఇదివరకే షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. వచ్చే వారం న్యూజిలాండ్‌లో ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేసినట్టు నిర్మాత జాన్ ప్లాన్‌డో ప్రకటించారు. అయితే ఇదివరకే ఈ సినిమా రిలీజ్‌ను 2021 సంవత్సరానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.సంబంధిత సమాచారం :