సూర్య ‘ఎన్ జి కె’ విడుదల మరింత ఆలస్యం కానుందా ?

Published on Feb 5, 2019 2:06 am IST


మచ్ అవైటెడ్ మూవీ ఎన్ జి కె విడుదల మరింత ఆలస్యం అయ్యేలా వుంది. ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదలచేయాలని అనుకున్న ఇప్పుడు మరో తేదీని పరిశీలిస్తున్నారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మే లోగా పూర్తి కానున్నాయట. అందుకనే సినిమాను మే 10 న లేదా మే 17న విడుదలచేయాడానికి ప్లాన్ చేస్తున్నారట.

ఇక ఈ చిత్రం యొక్క టీజర్ కోసం సూర్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 14న ఈ టీజర్ విడుదలకానుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తుండగా ప్రముఖ నటుడు జగపతి బాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న ఈచిత్రాన్ని డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకం ఫై ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :