ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు !

Published on Apr 14, 2019 9:23 am IST

స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న ‘కదరం కొండన్’ అనే చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. రాజేష్ ఎమ్ సెల్వ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ పోలీస్ గా నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క పోస్టర్లు సినిమా ఫై అంచనాలు క్రియేట్ చేశాయి.

అక్షరా హాసన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ట్రైడెంట్ ఆర్ట్స్ మరియు కమల్ హాసన్ హోమ్ బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రం మే 31న విడుదలకానుంది. ఇక సూర్య నటిస్తున్న మచ్ అవైటెడ్ మూవీ ఎన్ జి కె కూడా అదే రోజు విడుదలకానుంది. దాంతో ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురుకానుంది.

సంబంధిత సమాచారం :