అభిమానుల అంచనాలకు ధీటుగా ఉంటుంది !

Published on Apr 30, 2019 7:03 pm IST

‘గజిని’, ‘సింగం’ చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో సూర్య, ‘7జి బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘ఎన్‌.జి.కె’ (నంద గోపాలకృష్ణ). ఈ సినిమా ఆడియో, ట్రైలర్‌ విడుదల కార్యకమ్రం చిత్ర యూనిట్‌ సభ్యుల నడుమ వైభవంగా జరిగింది.

హీరో సూర్య మాట్లాడుతూ – ”ఎన్‌.జి.కె’ చిత్రాన్ని పొటిలికల్‌ డ్రామా, థ్రిల్లర్‌ అని అందరూ అంటున్నారు. కానీ, మరో యాంగిల్‌లో ఉండే సినిమా ఇది. 2000 సంవత్సరం తర్వాత రాజకీయ ఘటనలను అబ్జర్వ్‌ చేసిన డైరెక్టర్‌ శ్రీరాఘవగారి దక్కోణంలో సాగే సినిమా ఇది. ఇప్పటివరకు ఏ దర్శకుడినైనా అడిగానో లేదో తెలియదు కానీ.. తొలిసారి శ్రీరాఘవగారిని ‘నాతో సినిమా చేస్తారా?’ అని 2002లో అడిగాను. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం ఆనందాన్ని కలిగించింది. ప్రతి క్రాఫ్ట్‌ని ఆయన ఉపయోగించుకునే తీరు చూసి ఆశ్చర్యపోయాను. పనిని ప్రేమించి, ప్యాషన్‌తో చేయడం ఆయన అలవాటు. మే 31న ఈ సినిమా విడుదల కాబోతోంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా అభిమానుల అంచనాలకు ధీటుగా ఉంటుంది” అన్నారు.

దర్శకుడు శ్రీరాఘవ మాట్లాడుతూ ”నేను చేసిన సినిమాల్లో ఇది చాలా సంక్లిష్టమైన స్క్రిప్ట్‌. స్క్రిప్ట్‌ దశలో ఈ కథకు ఎవరు సరిపోతారా? అని నేను, నిర్మాతలు ప్రకాశ్‌, ప్రభు ఆలోచించుకుని సూర్య అయితేనే న్యాయం చేస్తాడని భావించి చేసిన సినిమా ఇది. సూర్య అద్భుతమైన నటుడు. చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌ను కూడా చక్కగా ఇచ్చారు. అన్నారు.

సంబంధిత సమాచారం :