ఇస్మార్ట్ శంకర్ లో నిధి అగర్వాల్ రోల్ రివీల్ !

Published on Mar 5, 2019 3:24 pm IST

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ గోవా లో జరుగుతుంది. ఈచిత్రంలో నిధి అగర్వాల్ , నాబా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా ఈసినిమాలో నాబా లోకల్ అమ్మయిగా నటిస్తుండగా నిధి శాస్త్రవేత్త గా కనిపించనుందట. ఆమె పాత్ర సినిమాకు కీలకం కానుంది.

ఇక సవ్యసాచి తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగుళూరు బ్యూటీ ఇటీవల మిస్టర్ మజ్ను తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ రెండు చిత్రాలు కూడా నిధి కి బ్రేక్ ఇవ్వలేకపోయాయి. మరి ఈ చిత్రమైన తెలుగులో ఆమె కు తొలి విజయాన్ని ఇస్తుందో లేదో చూడాలి. యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మే లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :