తెలంగాణాలో కూడా కర్ఫ్యూ..కానీ థియేటర్స్ పై రాని క్లారిటీ.!

Published on Apr 20, 2021 12:47 pm IST

మళ్ళీ దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎలాంటి భీతిని కలుగజేస్తుందో మనం చూస్తూనే ఉన్నాము. గత ఏడాది కంటే ఎక్కువగా సెకండ్ వేవ్ లో కరోనా వ్యాప్తి చెందుతుంది. మరి దీనితో దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ లను కర్ఫ్యూలను విధించుకుంటున్నాయి. మరి ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం కూడా కర్ఫ్యూ పెడుతున్నట్టుగా హుకుం జారీ చేశారు.

రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జాము 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉన్నట్టుగా తెలిపారు. అయితే ఈ కర్ఫ్యూలో భాగంగా ముందులానే మాల్స్ రెస్టారెంట్స్, థియేటర్స్ తదితర కాంప్లెక్స్ లు అన్నీ 8తో మూసి వెయ్యాలని ఒక్క వైద్యానికి సంబంధించినవి తప్ప అని సూచించారు.

అయితే థియేటర్స్ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. రాత్రి 8 వరకు థియేటర్స్ ఓపెన్ చేసి ఉంచొచ్చు కానీ ఫుల్ ఆక్యుపెన్సీ తోనేనా లేక కేవలం 50 శాతం తోనేనా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ పెట్టేసారు. మరి తెలంగాణాలో దీనిపై క్లారిటీ మిగిలి ఉంది.

సంబంధిత సమాచారం :