
మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల, నటి వితిక షెరు ఇద్దరూ ఈమధ్య ఎక్కువగా కలిసి కనిపిస్తున్నారు. అలానే ఈ ఇద్దరూ కలిసి జి మ్‌లో వర్కౌట్లు చేస్తుంటారు. అలా వీరు జిమ్ మేట్స్, క్లోజ్ ఫ్రెండ్స్‌లా మారిపోయారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి కాంచీపురం వారి నైరా సిల్క్‌ను తాజాగా ప్రారంభించారు. కాంచీపురం వారి నైరా సిల్క్ రెండో బ్రాంచ్ ప్రారంభోత్సవం గురువారం మాదాపూర్‌లో నిహారిక, వితిక షెరు చేతుల మీదుగా గ్రాండ్ గా జరిగింది.
ఇక ఇక్కడ టాప్ డిజైనర్స్ చేసిన కంచి పట్టు చీరలు, ఒక గ్రాము జరీ, రెండు గ్రాముల జరీ చీరలు దొరుకుతాయి. మొదటి బ్రాంచ్ కూకట్ పల్లిలో ఇప్పటికే కస్టమర్స్ యొక్క ఆదరణతో మంచి పేరు సొంతం చేసుకుంది. నేరుగా కాంచీపురం నుంచి కాకతీయ హిల్స్‌కు ఇప్పుడు కంచిపట్టు చీరలు వస్తున్నాయి. ఇక ఈ ప్రారంభోత్సవ వేడుకలో నిహారిక, వితిక షెరు మాట్లాడుతూ కాంచీపురం వారి అద్భుతమైన ఎన్నో డిజైనర్ చీరలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని, తప్పకుండా కస్టమర్స్ విజిట్ చేసి ఈ సదవకాశాన్ని వినియోగించాలని కోరారు.