ఇంటర్వ్యూ : నీహారిక కొణిదెల – సూర్యకాంతం అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను !

Published on Mar 28, 2019 4:35 pm IST

మెగా డాటర్ కొణిదెల నీహారిక హీరోయిన్ గా రాహుల్ విజయ్ హీరోగా ప్రణీత్ బ్రామ్మడపల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సూర్యకాంతం’. మార్చి 29 వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా నీహారిక మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

అసలు ‘సూర్యకాంతం’ అంటే ఏమిటి ? సినిమాకి ఆ పేరే ఎందుకు పెట్టారు ?

సినిమాలో నా క్యారెక్టర్ పేరు ‘సూర్యకాంతం’. సో సినిమా సూర్యకాంతం గురించే చెబుతున్నాం కాబట్టి సూర్యకాంతం అని పెట్టారు. ఇక కథ గురించి ఒక్క మాటలో చెప్పుకుంటే ఇది సరదాగా సాగే సరళమైన ప్రేమ కథ. అభి మరియు సూర్యకాంతం యొక్క జర్నీ, వారి మధ్య డ్రామా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను.

సినిమాలో మీ పాత్రకు సంబంధించి చెప్పండి?

ఎలాంటి బాధ భయం లేకుండా అలాగే ఎలాంటి దీర్ఘకాల లక్ష్యాలు లేకుండా… ప్రతిక్షణాన్ని సంతోషంగా గడపటానికి ఇష్టపడే అమ్మాయే సూర్యకాంతం. తను స్వతంత్రంగా బతికే అమ్మాయి.

ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీనా ?

ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమి కాదు గానీ, కథలో భాగంగా ఒక అబ్బాయి జీవితంలో ఎంటరైన ఇద్దరు అమ్మాయిలకు సంబంధించి కొంతభాగం ఉంటుంది. మూడు పాత్రల మధ్య వచ్చే డ్రామాకి సంబంధిచిన కథ బాగుంటుంది.

మీ హీరో రాహుల్ గురించి కొన్ని మాటలు?

రాహుల్ మంచి నటుడు. అలాగే చాలా సౌకర్యవంతమైన సహ నటుడు. తోటి నటీనటులకు చక్కని సహకారం అందిస్తాడు. చాలా కష్టపడతాడు. అతని కష్టం తెర మీద స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.

‘సైరా’లో మీ పాత్ర గురించి చెప్పండి ?

సైరా గురించి ఇప్పుడు నేను చెప్పలేను. కానీ సైరాలో నా పాత్రకు సంబంధించిన పార్ట్ షూట్ అయింది.

రాబోయే సంవత్సరాల్లో మేము నిహారికను ఎక్కువ సినిమాల్లో చూడవచ్చు ?

నా పరిధి మేరకు నటనకు సంబంధించి సీరియస్ గానే ఉన్నాను. అలాగే ప్రొడక్షన్ అంటే కూడా బాగా ఆసక్తి ఉంది. ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను. ఏమి చేసిన సంపూర్ణ నిర్ణయంతో నాకు నచినట్లే చేస్తాను.

సంబంధిత సమాచారం :