డేట్ చేయాల్సి వస్తే.. అలాంటి వ్యక్తినే ఎంచుకుంటా !

డేట్ చేయాల్సి వస్తే.. అలాంటి వ్యక్తినే ఎంచుకుంటా !

Published on Mar 17, 2019 11:28 PM IST

మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా రాహుల్ విజయ్ హీరోగా ప్రణీత్ బ్రామ్మడపల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సూర్యకాంతం’. మార్చి 29 వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా నిహారిక ప్రమోషన్స్ ను ప్రారంభించింది. అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు నిహారిక తనదైన శైలిలో జవాబులు ఇచ్చింది.

డేట్ చేయాల్సి వస్తే.. ఓపికగా వినే వ్యక్తిని మాత్రమే తాను ఎంచుకుంటానని… ఎందుకంటే తానెప్పుడూ ఎక్కువగా మాట్లాడతానని నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఇక రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత సందీప్ ఎర్రమరెడ్డి నిర్మిస్తున్నారు. రాబిన్ మార్క్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు