నాకు చాలా బాధగా వుంది కానీ తప్పలేదు – నిఖిల్ !

Published on Apr 25, 2019 1:44 pm IST

నిఖిల్ నటించిన అర్జున్ సురవరం మే 1న విడుదలకావాల్సి వుండగా ఈనెల 26న అవెంజర్స్ ఎండ్ గేమ్ భారీ స్థాయిలో విడుదలవుతుండడంతో డిస్ట్రిబ్యూటర్లు ఈసినిమా విడుదలను వాయిదా వేయాలని కోరారు . వారి రిక్వెస్ట్ ను గౌరవించి సినిమా విడుదలను వాయిదా వేశారు మేకర్స్. అయితే ఈ న్యూస్ తో నిఖిల్ నిరాశచెందాడు. ఈసినిమా కోసం ఇప్పటికే యాక్టీవ్ గా ప్రమోషన్స్ చేస్తున్నాడు నిఖిల్. ఇక ఈసినిమా విడుదల మరో సారి వాయిదాపడింది అనే విషయం బాధపెట్టిన డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయాన్ని గౌరవిస్తానని నిఖిల్ తెలియజేశాడు. ఈ సందర్బంగా ఓ లేఖను కూడా విడుదలచేశాడు.

ఇక ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని విడుదలచేయనుంది. త్వరలోనే కొత్త విడుదలతేదిని ప్రకటించనునున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం :