నిఖిల్ కు పోటిగా నయనతార !
Published on Mar 8, 2018 11:04 am IST

నిఖిల్ నటించిన ‘కిరాక్ పార్టి’ సినిమా ఈ నెల 16 న విడుదల కాబోతోంది. శరణ్ కొప్పిశెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఏకే. ఎంటర్టైన్మెంట్ సంస్థలో అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించడం జరిగింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ యూత్ ఫుల్ సినిమా పై నిఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీతో పాటు నయనతార నటించిన ‘కర్తవ్యం’ సినిమా కూడ విడుదల కానుంది.

హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘ఆరమ్’. ఈ సినిమాను ‘కర్తవ్యం’ పేరుతో తెలుగులో విడుదల చెయ్యబోతున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్మెంట్ అధినేత శరత్ మరార్ మరియు డిస్ట్రిబ్యూటర్ ఆర్ రవీంద్రన్, సంయుక్తం‌గా విడుదల చెయ్యబోతున్నారు. మరి రజనీకాంత్ సైతం ప్రశంసించిన ఈ సినిమా నిఖిల్ సినిమాకు ఏ స్థాయిలో పోటీ ఇస్తుందో చూడాలి.

 
Like us on Facebook