యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా సంయుక్త మీనన్ అలాగే నభా నటేష్ హీరోయిన్స్ గా భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ డ్రామా చిత్రం “స్వయంభూ”(Swayambhu) చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాపై టీం అంతా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా నుంచి నుంచి అవైటెడ్ టీజర్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ ని ఫిక్స్ చేశారు.
ఈ ఫిబ్రవరి 11న ఈ సినిమా తాలూకా టీజర్ ని వదులుతున్నట్టు కన్ఫర్మ్ చేసారు. ఇక దీనితో రిలీజ్ చేసిన పోస్టర్ కూడా మంచి పవర్ఫుల్ గా కనిపిస్తుండగా వారియర్ లుక్ లో నిఖిల్ అదరగొట్టాడు. ఇక ఈ సినిమాకి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా భువన్, శ్రీకర్ లు నిర్మాణం వహిస్తున్నారు. మరి ఈ రానున్న టీజర్ తో కొత్త రిలీజ్ డేట్ ని రివీల్ చేస్తారో లేదో అనేది చూడాలి.


