సీక్వెల్ కోసం సిక్స్ ప్యాక్ సిద్ధం చేస్తున్న యంగ్ హీరో

Published on Apr 4, 2020 12:45 pm IST

యంగ్ హీరో నిఖిల్ కరోనా క్వారంటైన్ లో కండలు పెంచే పనిలో ఉన్నాడట. తన సిక్స్ ప్యాక్ బాడీ ప్రోగ్రెస్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నాడు. అలాగే మరో నాలుగు వారాలలో పూర్తిగా మారిపోవాలని మంచి షేప్ సాధించాలని టార్గెట్ పెట్టుకున్నాడట. నేడు చొక్కా లేకుండా బేర్ బాడీతో ఉన్న ఫోటో ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు నిఖిల్. ఈ సిక్స్ ప్యాక్ బాడీ తన తదుపరి సినిమా కోసమని తెలుస్తుంది. చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ కార్తికేయ 2 చేస్తున్న సంగతి తెలిసిందే.

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 తెరకెక్కుతుంది. కొద్దిరోజుల క్రితం తిరుపతి వేదికగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇక కాన్సెప్ట్ వీడియో పేరుతో సినిమా నేపథ్యం తెలుపుతూ ఓ వీడియో విడుదల చేయగా అది ఆసక్తిని రేపింది. టి జి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More