ఏ సినిమాకి ఇన్ని కష్టాలు పడలేదు – నిఖిల్

Published on Nov 19, 2019 11:00 pm IST

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ తన కొత్త చిత్రం ‘అర్జున్ సురవరం’ కోసం పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడో విడుడలకావాల్సిన ఈ చిత్రం టైటిల్ విషయంలో ఒకసారి వాయిదాపడి ఆ తర్వాత పలు కారణాల వలన అనేకసార్లు వాయిదాపడుతూ వచ్చింది. దీంతో ఇక సినిమా రాదని అందరూ అనుకున్నారు.

కానీ నిఖిల్ మాత్రం సినిమాను వదల్లేదు. సినిమాకున్న అడ్డంకుల్ని తొలగించడానికి తన వంతు కృషి చేశాడు. ఎట్టకేలకు అన్ని కష్టాలు తొలగి ఈ నెల 22న చిత్రం విడుడలకానుంది. ఈ చిత్రం గురించి నిఖిల్ మాట్లాడుతూ 17 సినిమాలకి పడని కష్టం ఈ సినిమాకి పడ్డాను. నిజాయితీ కలిగిన ఒక సినిమాని మీ దగ్గరకు తీసుకురావాలనేదే నా ప్రయత్నం అంటూ భావోద్వేగంగా ట్వీట్ చేశారు.

ఈ నెల 29న విడుడలకానున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయకిగా నటించింది. టి.సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More