యంగ్ హీరో నిఖిల్ ‘స్వామీ రారా’ సినిమాతో కమర్షియల్ గా సక్సెస్ అందుకొని తన తదుపరి సినిమా ‘కార్తికేయ’ ని సిద్దం చేస్తున్నాడు. దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్న సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో కలర్స్ స్వాతి నిఖిల్ సరసన రెండోసారి జోడీ కట్టింది.
ఇదంతా పక్కన పెడితే నిఖిల్ ఇప్పుడు స్టూడెంట్ గా మారి రోజూ కాలేజ్ కి వెళ్తున్నాడు. అర్థం కావట్లేదా.? అయితే ఇది చదవండి. నిఖిల్ నటిస్తున్న తన తదుపరి సినిమా ‘సూర్య vs సూర్య’ ని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. షూటింగ్ లో నుంచి ఓ ఫోటో ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ నిఖిల్ ‘అందరికీ హాయ్.. సూర్య vs సూర్య కోసం కోసం నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నాను. హ్యాపీ డేస్ తర్వాత మళ్ళీ నేను చేస్తున్న కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న సినిమా ఇదని’ ట్వీట్ చేసాడు.
నిఖిల్ స్టూడెంట్ గా చేసిన హ్యాపీ దేశ సినిమాలో అతని పెర్ఫార్మన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమాతో కూడా అదే మేజిక్ ని రిపీట్ చేస్తాడని ఆశిద్దాం..


