పెళ్లి వాయిదా వేసుకున్న మరో హీరో !

Published on Apr 7, 2020 12:50 pm IST


హీరో నిఖిల్ డాక్టర్ పల్లవి వర్మని ప్రేమించి అందరి సమ్మతితో ప్రేమ వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16న ఈ పెళ్లి జరగాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా మరియు లాక్ డౌన్ కారణంగా తన వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు నిఖిల్ ప్రకటించారు. “ప్రస్తుత పరిస్థితుల్లో మేము వివాహం చేసుకోవడం సాధ్యమవుతుందని నేను అనుకోను. అందుకే మా వివాహాన్ని వాయిదా వేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు” అని నిఖిల్ అన్నారు.

కాగా నిఖిల్, డాక్టర్ పల్లవి వర్మకి గోవాలో ప్రపొజ్ చేసి తనని మెప్పించి పెద్దల్ని ఒప్పించి ఎక్కడైతే ప్రపొజ్ చేసాడో అదే గోవాలో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇక నిఖిల్ ‘అర్జున్ సురవరం’ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో మంచి వసూళ్లను రాబట్టి.. నిఖిల్ కెరీర్ లో బెస్ట్ మూవీస్లో ఒకటిగా నిలిచింది. బ్లాక్ బస్టర్ మూవీతో ఊపు మీద ఉన్న హీరో నిఖిల్ ప్రస్తుతం సుకుమార్ మరియు అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా ఓ సినిమా చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More