యంగ్ హీరో నిఖిల్ నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చిత్రీకరణతో పాటు అన్ని పనులు పూర్తై కొన్ని నెలలు గడిచినా విడుదలకు నోచుకోలేదు. మే, జూన్ అంటూ వాయిదాపడుతూ.. చివరికి ఈ నెల 29న విడుదలకు సిద్దమైంది. కాగా సినిమా పై అంచనాలు పెంచటానికి ప్రమోషన్స్ గట్టిగానే ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. వాటిలో భాగంగానే ఈ నెల 26న హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో భారీగా ప్రీరిలీజ్ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఇక ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయకిగా నటించింది. టి.సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మించారు. నిఖిల్ మాత్రం ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి హిట్ అందుకుంటాడేమో చూడాలి.


