
కెరీర్ ని రిస్క్ చేసి మరీ రొటీన్ కి భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్ లను ఎంచుకోవడమే కాకుండా హ్యాట్రిక్ హిట్స్(స్వామి రారా, కార్తికేయ, సూర్య vs సూర్య) అందుకున్న యంగ్ హీరో నిఖిల్. సినిమాల స్క్రిప్ట్ విషయంలోనే కాదు సినిమా కోసం కూడా ఎంత రిస్క్ తీసుకోవడానికైనా నిఖిల్ సిద్దం అంటున్నాడు. ఈ మాటలనే ప్రస్తుతం నిఖిల్ నిజం చేస్తున్నాడు. ఎక్కడ.? ఎలా.? అంటారా.. అయితే చదవండి.. నిఖిల్ హీరోగా చేస్తున్న తదుపరి సినిమా ‘శంకరాభరణం’. క్రైమ్ కామెడీ జోనర్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల 14న మొదలైంది.
ప్రస్తుతం ఈ చిత్ర టీం పూణేకి 60కిమీ దూరంలో ఉన్న బోర్, నగరి, వాయ్ ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. ఆ ప్రాంతాల్లో మనుషులు వెళ్ళడానికి సాహసం చేయని కొన్ని రిస్కీ లొకేషన్స్ లో ఈ చిత్ర టీం షూటింగ్ చేస్తోంది. ఇలాంటి లోకేషన్స్ లో కూడా నిఖిల్ ఏ మాత్రం భయపడకుండా ఎంతో రిస్కీ ప్లేస్ లలో షూటింగ్ చేస్తున్నాడు. ఈ చిత్ర టీం కూడా రిస్క్ చేయడంలోనే అసలైన కిక్ ఉందంటూ షూటింగ్ చేస్తున్నారని సమాచారం. నిఖిల్ డెడికేషన్ చూసి ఈ చిత్ర రైటర్, నిర్మాత కోన వెంకట్ నిఖిల్ కి కితాబులిచ్చాడు. నిఖిల్ సరసన నందిత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా ఉదయ్ నందనవనం డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.