ఆ హీరోయిన్ తో నటించనున్న నిఖిల్ !
Published on Mar 4, 2018 6:46 pm IST

నిఖిల్ నటించిన కిరిక్ పార్టి సినిమా ఈ నెల 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శరణ గోపి శెట్టి ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాపై అందరిని అలరించబోతోందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని పాటకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మొదట ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ విషయంలో రకరకాల పేర్లు వినిపించినా చివరికి హన్సిక ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళ్ కనితన్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన సంతోష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నిన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది.

 
Like us on Facebook