’18 పేజెస్’.. అంతా హీరోయిన్ చుట్టూనే తిరుగుతుందా ?

Published on Jun 1, 2021 9:02 pm IST

యువ హీరో నిఖిల్ కొత్త చిత్రాల్లో ’18 పేజెస్’ ఒకటి. ఇందులో అనుమప పరమేశ్వరన్ కథానాయకిగా నటిస్తోంది. ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు టీమ్. ఫస్ట్ లుక్ అయితే ఆసక్తికరంగానే ఉంది. హీరో కళ్ళకు కాగితంతో గంతలు కట్టి దాని మీద హీరోయిన్ తనకు రాయడం అంటే ఎంత ఇష్టమో, ఎందుకు ఇష్టమో అక్షరాల రూపంలో చెబుతుంది. దీన్నిబట్టి ’18 పేజెస్’ అనే ఈ కథ హీరోయిన్ రాసుకునే రాతల చుట్టూ తిరిగే కథని అర్థమవుతోంది. ఆ రాతలు ఒక డెయిరీ అయినా అయ్యుండొచ్చు.

గతంలో కూడ హీరో లేదా హీరోయిన్ రాసుకున్న డైరీ చూట్టూ నడిచే కథలు వచ్చాయి. కానీ ఎందుకో ఈ చిత్రం కొంత భిన్నంగానే ఉంటుందనే అభిప్రాయం కలుగుతోంది. పైగా స్టోరీ స్క్రీన్ ప్లే సుకుమార్ ఇచ్చినవి. కాబట్టి సినిమా మీద మరింత నమ్మకం కలుగుతోంది. మరి ఫస్ట్ లుక్ ద్వారా క్రియేట్ చేసిన క్యూరియాసిటీని చిత్రం ఎంతవరకు నిలబెట్టుకుంటుందో చూడాలి. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :